తెలంగాణా లో బిజెపి అధికారం లోకి రావడానికి జాతీయ నాయకత్వం కార్యకర్తలకు అండగా ఉటుంది

తెలంగాణా లో బిజెపి అధికారం లోకి రావడానికి జాతీయ నాయకత్వం కార్యకర్తలకు అండగా ఉటుంది

2023 ఎన్నికల్లో బిజెపి జండా ఎగురవేస్తాం
అసెంబ్లీ ప్రవాస్ యోజన లో భాగంగా షాద్ నగర్ లో
మంగళూరు ఎమ్మెల్యే  వేదవ్యాస కామత్

 ముద్ర, షాద్‌నగర్: తెలంగాణా లో బిజెపి అధికారం లోకి రావడానికి జాతీయ నాయకత్వం కార్యకర్తలకు అండగా ఉటుందని కర్ణాటక రాష్ట్ర మంగళూరు ఎమ్మెల్యే వేదవ్యాస కామత్ అన్నారూ. బీజేపీ అధ్వర్యంలో నిర్వహిస్తున్నా ఎమ్మెల్యే ప్రవాస్ అభియాన్ లో భాగంగా ఆదివారం  కర్ణాటక రాష్ట్ర మంగళూరు శాసన సభ్యులు వేదవ్యాస కామత్  షాద్ నగర్కు వచ్చారు. ఈ సందర్భంగా  నియోజకవర్గం ముఖ్య నాయకులతో, జిల్లా పదాదికారులతో  సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమములో ఆయన మాట్లాడుతు తెలంగాణా లో బిజెపి అధికారం లోకి రావాలని, కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు నేను షాద్ నగర్ కు రావడం జరిగిందని అన్నారు. మోడీ గారి సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ, నిరంకుశ, కుటుంబ పాలనకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు.

మళ్ళీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ ఎన్ని దొంగ హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మరని అన్నారు. గతం లో కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ రాజకీయాలు చేసిందని, ఉప ఎన్నికల్లో కూడా BRS పార్టీ కి బిజెపి పార్టీ నే ప్రత్యన్యాయమని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. మోడీ ప్రభుత్వం తెలంగాణా లో కూడా రావాలని ప్రజలు కోరుకుంటాన్నారని అన్నారు. కావున రాబోయే ఎన్నికల్లో షాద్ నగర్ లో అధికారమే లక్ష్యం గా అందరూ కలిసి కట్టుగా పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కార్యక్రమ కోఆర్డినేటర్ దేపల్లి అశోక్ గౌడ్,అసెంబ్లీ  జిల్లా బీజేపీ కన్వీనర్ డా విజయ్ కుమార్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి,  అందె బాబయ్య, కమ్మరి  భూపాల చారి కక్కునూరి వెంకటేష్ గుప్తా, వెంకటేష్ గుప్త, చెంది మహేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మిథున్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మఠం ఋషికేష్, మహేందర్ రెడ్డి, నాగరాజు చారి, నర్సింహా యాదవ్, సుధాకరప్ప, కొమరబండ శ్రీశైలం, వెంకటేష్ యాదవ్, బోయ కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.