నిరుద్యోగులకు బీ ఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలను ఎండగట్టేందుకే బస్సు యాత్ర 

నిరుద్యోగులకు బీ ఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలను ఎండగట్టేందుకే బస్సు యాత్ర 
  • బీ ఆర్ఎస్ ను ఓడించేందుకే ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కు ఓటు వేయాలని చెబుతున్నామని ఓయూ విద్యార్థులు వెల్లడి

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేసిందని ఓయూ విద్యార్థులు విమర్శించారు .ఓయూ విద్యార్థులు బస్సు యాత్ర తాండూర్ కు చేరుకుంది. ఉద్యోగాల భర్తీ పేరుతో నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్పీఎస్సీ అంతా ఉద్యోగ  నియామకాలను గందరగోళంగా మార్చిందన్నారు. నిధులు నీళ్లు నియామకాల పేరిట తెలంగాణ ఉద్యమంలో అవిశ్రాంతంగా పోరాటం చేసి తెలంగాణ సాధనలో ప్రధాన భూమిక పోషిస్తే సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను నట్టేట ముంచిందని విమర్శించారు. నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియచెప్పేందుకు అలాగే టిఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థులను గెలిపించేందుకు తాము బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తెలిపారు . తాండూరులో కాన్స్ అభ్యర్థికి ఓయూ విద్యార్థులు మద్దతు ఉంటుందని గ్రామాల తిరిగి ఆయనకు ఓటు వేయాలని ప్రచారం చేస్తామని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓయూ విద్యార్థులు బస్సు యాత్రలు రాష్ట్రమంతా విస్తరిస్తామని తెలిపారు. స్థానికంగా ఉండే నిరుద్యోగులకు కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను వివరించి వారు కూడా బీ ఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేయడంలో బాధ్యత వహించేలా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లా తాండూరులో కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి ఓయూ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.