తెలంగాణ రాష్ట్రని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకీ రాష్ట్రంలో ఒకసారి అవకాశం కల్పించాలి

తెలంగాణ రాష్ట్రని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకీ రాష్ట్రంలో ఒకసారి అవకాశం కల్పించాలి

ముద్ర.వీపనగండ్ల: ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకీ రాష్ట్రంలో ఒకసారి అవకాశం కల్పించాని మాజీ మంత్రి కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  జూపల్లి కృష్ణారావు అన్నారు.జూపల్లి స్వగ్రామమైన
 చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామంలో సోమవారం ఉదయం పర్యటించిఎన్నికల ప్రచారం నిర్వహించారు, ఈసందర్భంగా గ్రామ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకీ తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి అవకాశం కల్పించాలని,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయబోయే ఆరు గ్యారెంటీ ల గురించి ప్రజలకు తెలియజేశారు.తన హయాంలో పెద్ద దగడ గ్రామంలో ఎన్నో అభివృద్ది పనులు జరిగాయని అవి అన్నీ నేడు మీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయని, రేపటి మీ బిడ్డల భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకోవాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్,సర్పంచ్ సురేందర్ సింగ్,నాయకులు కళ్యాణ్ రావు తదితరులు ఉన్నారు.