పెద్దపల్లి ఎమ్మెల్యే అవుతనన్నాడు.. ఎటు తేల్చుకోలేక పోయాడు

పెద్దపల్లి ఎమ్మెల్యే అవుతనన్నాడు.. ఎటు తేల్చుకోలేక పోయాడు
  • చివరికి గులాబీ తీర్థం పంచుకున్న ఓదెల జడ్పీటీసీ గంట
  • గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఆర్ఎస్ పోలిటీ బ్యూరో సభ్యులు కేశవరావు, మంత్రి హరీష్ రావు 

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: తాను పెద్దపెల్లి ఎమ్మెల్యే గానే పోటీ చేస్తానని చెప్పి... ఎటు తెల్చుకోలేక పోయాడు చివరికి గులాబీ తీర్థం పుచ్చుకొని అందరికీ షాక్ ఇచ్చిన గంట... మండల స్థాయిలో అన్ని పదవులు అనుభవించానని ఇక తాను ఎమ్మెల్యేగా నే పోటీ చేస్తానని ఎమ్మెల్యే టికెట్ కోసం చివరిదాకా పోరాడి. పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో అలిగి పార్టీకి రాజీనామా చేశాడు. దీంతో మరో పార్టీలో టికెట్ తీసుకొచ్చుకొని పెద్దపెల్లి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని  ప్రజలందరూ ఊహించారు...  కానీ ఎవరి ఊహలకు అందకుండా రెండు పార్టీలను సమానంగా విమర్శించిన ఓదెల జడ్పీటీసీ గంట రాములు యాదవ్ చివరకు గులాబీ తీర్థం పుచ్చుకొని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. 

పెద్దపల్లిలో నియోజకవర్గంలో ఎన్నికల సమీపిస్తుండడంతో రాజకీయ నాయకులు రంగులు మారుస్తుండడం సర్వసాధారణమైందే... కానీ కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా ఉంటూ అత్యంత నమ్మకస్తుడిగా పార్టీకి సేవలందించిన సీనియర్ నాయకులు గంట ఎన్నికల సమయంలో  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో పెద్దపల్లి లో రాజకీయాలు రసవంతంగా మారనున్నాయి. రెండు పార్టీలలో నాయకులు అటు ఇటు జంపింగ్ చేయటం ఎన్నికల్లో సర్వ సాదర్నమే...కానీ గంట ఓదెల మండలంలో మంచి పట్టున్న నాయకుడు అలాగే నియోజకవర్గంలో కూడా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అనుకున్న ఆయన అభిమానులను గంట తీసుకున్న నిర్ణయంతో మనస్థాపానికి గురి   చేశాడనిపిస్తుంది... ఆదివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పొలిటి బ్యూరో సభ్యులు కేశవరావు, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావులు కండువా కప్పి గంట రాములు యాదవ్ ను పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు  రవీందర్ సింగ్, పలువురు ప్రజా ప్రతినిధులు ఉన్నారు.