ఐదేళ్లపాటు ప్రజలకు సేవ చేస్తానని బాండ్ పేపర్లపై రాసిన వారినే నమ్మి ఓటు వేయాలి 

ఐదేళ్లపాటు ప్రజలకు సేవ చేస్తానని బాండ్ పేపర్లపై రాసిన వారినే నమ్మి ఓటు వేయాలి 
  • తనకు కేటాయించిన పాదరక్షల గుర్తును అనుసరిస్తూ చెప్పులు మెడలో వేసుకుని ప్రచారం నిర్వహించిన
  • తాండూర్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: నీతి నిజాయితీపరుడిని, నీతిమంతుడిని, అలాగే తమ మేలు కోసం పనిచేసే అభ్యర్థిని ఎన్నుకోవాలని వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్ విన్నూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. మంగళవారం తాండూర్ పట్టణంలో , మండలంలో ప్రజలను వ్యాపార స్తులను కలుసుకుని ప్రచారం నిర్వహించారు. పాలు ఎన్నికల నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే ప్రజలకు నిజాయితీగా నమ్మకంగా సేవ చేస్తానని వాగ్దానము చేస్తూ సంతకం చేసిన బాండ్ పేపర్లను బహిరంగపరచాలని అందువల్ల అగ్రిమెంట్ ప్రకారం ఐదేళ్లపాటు తాండూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు ఆసక్తి చూపుతున్న తనలాంటి వారిని ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు. పాండురంగంలో తనలా కాకుండా కేవలం నోటిమాటలుగా హామీ ఇస్తున్న వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులను నమ్మవద్దని ప్రచారంలో పేర్కొన్నారు.   ఆ పిల్లపై తనలా సంతకం చేసి ఇవ్వని వాళ్లను ఎలా నమ్ముతారని ప్రజలను ఒక రకంగా ప్రశ్నిస్తూ ప్రచారం చేస్తున్నారు.  ఓటర్లను మభ్యపెట్టి
ఓట్లు కొనుగోలు చేసే వాళ్లను నిజాయితీపరులుగా ఎలా నమ్మగలరని  ప్రచారం లో ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో తనకు వచ్చిన పాదరక్షలు గుర్తు ను తెలియజేస్తూ మెడలో
 వేసుకుని  స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్ చేస్తున్న ప్రచారం పట్ల పనులు ఆసక్తి కనబరుస్తున్నారు.