ముమ్మరంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారం

ముమ్మరంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారం

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:తాండూర్ నియోజక వర్గం యాలాల్  మండలంసంగాయిపల్లి, గంగాసాగర్, రాస్నం, పగిడియాల్ గ్రామాల్లో మంగళ వారం రాత్రి తాండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ప్రచార నిమిత్తం విచ్చేసిన తాండూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డికి ఆయా గ్రామాల ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అయిపోయిందని వెల్లడించారు. పేదలు, రైతులు ఇన్నాళ్లు పడిన కష్టాలు దూరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తాండూర్ నియోజకవర్గంలో ఐదేళ్ల లో బీ ఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమి లేదని విమర్శించారు. తాండూరు నియోజకవర్గం లో రోడ్ల తీరు దారుణంగా ఉందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీలను ప్రజలకి వివరించారు.