ఫోర్జరీతో ప్లాట్ల విక్రయం..!

ఫోర్జరీతో ప్లాట్ల విక్రయం..!
  • మేరీ సువర్ణభూమి రిసార్ట్స్ యజమానుల పిర్యాదు .!
  • ఫోర్జరీ సంతకాలను  ఫోరెన్సిక్ ల్యాబ్  కు  పంపిన పోలీసులు ..!
  • ఫోర్జరీ అయినట్టు నిర్ధారణ !
  • నిందితులను అరెస్టు చేసిన షాద్ నగర్  పోలీసులు.!
  • వివరాలు వెల్లడించిన శంషాబాద్ డిసిపి నారాయణ్ రెడ్డి..!

షాద్ నగర్, ముద్ర ప్రతినిధి: ఫోర్జరీ సంతకాలతో ప్లాట్ల విక్రయానీకి  పాల్పడిన నిందితుడిని షాద్ నగర్ పోలీసులు  అరెస్టు చేశారు. షాద్ నగర్ ఏసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి వివరాలు వెల్లడించారు. మేరీ సువర్ణ భూమి రిసార్ట్స్ లో డైరెక్టర్ గా ఉన్న మంచాల సాయి సుధాకర్, కళ్యాణ్ చక్రవర్తి అనే ఇద్దరు కొన్ని ప్లాట్లను ఫోర్జరీ సంతకాలు చేసి నకిలీ సంతకాలతో నిధులు దుర్వినియోగం చేశారని మేరీ సువర్ణ భూమి కి సంబంధించిన కే.రోజారాణి ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇప్పటికే మంచాల సుధాకర్ ను తేదీ 21 /12/ 2021 రోజున అరెస్టు చేశారు రెండో నిందితుడు కళ్యాణ్ చక్రవర్తి పరారీలో ఉన్న క్రమంలో పై అధికారుల ఆదేశానుసారం తేదీ  9/ 2/ 2024 నాడు విజయవాడలో అరెస్టు చేశారు.

నకిలీ సంతకాలతో మోసపూరితంగా ప్లాట్లను అమ్ముతూ నిధుల దుర్వినియోగానికి పాల్పడి డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు విరు  వీరిపై కొత్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు కావడంతో అలాగే షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు అయింది. డాక్యుమెంటును పోరిన్సిక్ ల్యాబ్ కు న్యాయస్థానం ద్వారా పంపగా ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం సంతకాలు ఫోర్జరీ కాబడినట్టు నిర్ధారణ కావడంతో వీరిపైన 420,406,468,467,471, ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు. వీరిపై గతంలో నుండి కూడా పలు కేసులు నమోదయ్యాయి ఈ మీడియా సమావేశంలో శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి షాద్ నగర్ ఏసిపి రంగస్వామి షాద్ న పట్టణ సిఐ ప్రతాప లింగం నరసింహ నాయక్ ఎస్సై శరత్ కుమార్ నరసింహ నాయక్ కరుణాకర్ యాదగిరి తదితరులు ఉన్నారు.