భూ సారాన్ని... పెంచుటకే క్షేత్ర దినం.

భూ సారాన్ని... పెంచుటకే క్షేత్ర దినం.

మండల వ్యవసాయ అధికారి జీ.తులసి

చేవెళ్ల , ముద్ర: చేవెళ్ల మండల పరిధిలో రేగడి ఘనపూర్ గ్రామంలో సర్పంచ్ నర్సింలు ఆధ్వర్యంలో క్షేత్ర దినోత్సవం (ఫీల్డ్ డే)ను మండల వ్యవసాయ అధికారి జి.తులసి నిర్వహించారు.యాసంగి సీజనులో  వినియోగించే ట్రైకోడర్మా విరిడి వినియోగం,పిఎస్బి వినియోగం, వరిలో వెదజల్లే పద్ధతి మరియు ఎరువులు దపాలుగా వినియోగించడం గురించి రైతులకు వివరించారు. ట్రైకోడెర్మా విరిడి నేలలోని సారాన్ని పెంచి మొక్కలకు తెగులు రాకుండా నివారిస్తుందనీ, ఫాస్ఫరస్ సాలుబులైజింగ్ బ్యాక్టీరియా నెలలో ఉన్న ఫాస్పరస్ ను మొక్క తేలికగా తీసుకుని రూపంలోకి మార్చుతుంది.

దీనివలన హెక్టర్కు ఒక బస్తా ఖర్చు అదే చేయవచ్చు అని తెలిపారు. వరిలో వెదజల్లే పద్ధతి ద్వారా నేరుగా విత్తుకునే వరి వలన నాటు ఖర్చు ఉండదని పంటకాలం కూడా 10 రోజులు తగ్గుతుందని ఎకరానికి 8వేల వరకు ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు.దపాలుగా ఎరువుల వినియోగం వలన ఎరువులను ఒకేసారి కాకుండా దపాలుగా వేసుకోవడం వలన పంటకు బాగా ఎరువులు అందుతాయి మరియు అధిక దిగుబడులు పొందగలుగుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతుబంధు సమన్వయ సమితి మండల అధ్యక్షులు బర్కల రామిరెడ్డి, విస్తరణ అధికారులు బాలకృష్ణ రమేష్,వరుణ్,రాజేశ్వర్ రెడ్డి,స్వాతి గ్రామ రైతులు పాల్గొన్నారు.