గౌడ్స్‌ మద్దతు బీఆర్‌ఎస్‌కే 

గౌడ్స్‌ మద్దతు బీఆర్‌ఎస్‌కే 
  • మంత్రి జగదీష్ రెడ్డి కి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం 
  • బీఆర్‌ఎస్‌తోనే గౌడ్‌ల సంక్షేమం సాధ్యం
  • కాంగ్రెస్, బిజెపి లను వీడి మూకుమ్మడిగా బీఆర్ఎస్ లో చేరిన కుడ.. కుడ గౌడ సోదరులు
  • గులాభీ కండువా లతో స్వాగతం పలికిన మంత్రి జగదీష్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బసిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యాపేట లో  బీఆర్‌ఎస్‌ పార్టీకే తమ సంపూర్ణ మద్దతు అని, మంత్రి జగదీష్ రెడ్డి తోనే మా ప్రయాణం అని కుడ..కుడ గౌడ నాయకులు ప్రకటించారు. సూర్యాపేట  ఆర్థికాభివృద్ధికి బాటలు వేసిన మంత్రి జగదీష్ రెడ్డి వెంటే తాము ఉంటామని స్పష్టంచేశారు. బుదవారం కుడ కుడ లో  మంత్రి జగదీష్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు, రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి ని  కలిసి తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ , బిజెపి లకు స్వస్తిపలికిన గౌడ్ సోదరులు  రాష్ట్ర నాయకులు గుర్రం సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యం లో  భీఆర్ఎస్ లో చేరారు. చేరిన వారిలో  బూర రాములు గౌడ్,బూర సతీష్ గౌడ్, నరసింహ గౌడ్,బూర రవి,బూర నాగయ్య ,బూర సోమయ్య ,బూర శీను, బూరమనయ్య, బూర జానకి రాములు, బూర కార్తీక్ గౌడ్, శ్రీను బూర సైదులు ,బూర అనిల్, బూర ఉపేందర్ ,బూర కార్తిక్ ,బూర శ్రీను, బూర రాజు, బూర చంటి, చలివేరు మహేంద్ర గౌడ్, పొదిల లాలయ్య గౌడ్, అనంతుల చంద్రయ్య గౌడ్, వెలమ కంటి శంకర్ గౌడ్ ,వెలమకంటి రాము, వెలమకంటి లక్ష్మణ్,  వెలమకంటి  వెంకన్న లు  చేరగా, గులాబీ కండువా లు కప్పిన  బసిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు. కార్యక్రమం లో ఉప్పల ఆనంద్,ముదిరెడ్డి అనిల్ రెడ్డి, బండారు సోమయ్య ,నాని ,దేశోజు పర్వతం భరత్ చారి  ఆదికేశవ చారి జక్కల శంకర్ తదతరులు పాల్గొన్నారు.