బానాపుర్, నాగసముందర్ గ్రామాల్లో కాంగ్రెస్ లో చేరిన బీజేపీ, బీ ఆర్ ఎస్ కార్యకర్తలు

బానాపుర్, నాగసముందర్ గ్రామాల్లో కాంగ్రెస్ లో చేరిన బీజేపీ, బీ ఆర్ ఎస్ కార్యకర్తలు

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: తాండూర్ నియోజక వర్గం యాలాల్  మండలం
బాణాపూర్ గ్రామానికి మంగళ వారం  ప్రచార నిమిత్తం విచ్చేసిన తాండూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనోహర్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు.
తాండూర్ నియోజకవర్గం
 యాలాల్ మండలం
  నాగ సముద్రం, బాణాపుర్ గ్రామాల్లో 
 బిఆర్ఎస్ , బి జే పీ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో తాండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి 
  మనోహర్ రెడ్డి  సమక్షంలో చేరారు.  మనోహర్ రెడ్డి  మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీలను ప్రజలకి వివరించారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ హామీల అమలులో భాగంగా 
మహాలక్ష్మి పధకం తో మహిళాభ్యున్నతి, రైతు భరోసా ద్వారా రైతన్నను రాజును చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
 గృహజ్యోతితో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తో పాటు ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేసి ఇందిరమ్మ సొంతయింటి కల నెరవేరుస్తామని అన్నారు.
యువ వికాసం తో యువతలో ఆత్మవిశ్వాసం, చేయూతతో వృద్ధుల  ఆసరాలతో పేదవాడికి ఈ ఆరు పధకాలు ఆరోప్రాణంగా నిలవనున్నందున  కాంగ్రెస్ పార్టీకి  ఆకార్షితులై అన్ని వర్గాల ప్రజలు    కాంగ్రెస్ పార్టీ వైపు మల్లుతున్నారనిఅన్నారు.   అధికార పార్టీ నాయకులను బిత్తర పోయేలా చేస్తున్నాయని గెలుపు లక్ష్యంగా పార్టీ లో చేరిన వారు. కృషి చేయాలని కోరారు.. అవినీతి అరాచక పాలన పాలిస్తున్న బీ ఆర్ ఎస్ పార్టీని బొందపెట్టి ఈ ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు.