బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయం

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయం
  • కాంగ్రెస్కు ఓటు వేస్తే సంక్షేమ పథకాలన్నీ మాయం అవుతాయి
  • తాండూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ బైక్ ర్యాలీలు
  • తాండూరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి చివరి రోజు అయిన మంగళవారం బీఆర్ఎస్ అభ్యర్థి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని పెద్దేముల్, తాండూరు,  బషీరాబాద్, యలాల్ మండలాల్లో బైక్ ర్యాలీలకు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది.
పెద్దేముల్ మండలం కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  రోహిత్ రెడ్డి మాట్లాడుతూ మూడవసారి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. తాండూర్ నియోజకవర్గ ప్రజలు ఆగం కాకండి ఆలోచించండి,  కారు గుర్తుకు ఓటు వేయండి, కుట్రదారులనుండి తాండూరును కాపాడండి అని కోరారు.  ప్రజా సమస్యల పరిష్కారానికి నా ఇంటి దర్వాజాలు 24 గంటలు తెరిచి ఉంటాయి అని అన్నారు.  ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు నేను ఇచ్చిన సాన్నిహిత్యం ఏ ఎమ్మెల్యే లోనైనా చూశారా అని ప్రశ్నించారు.  కాంగ్రెస్ కు ఓటు వేస్తే 10 ఎండ్లు వెనకకు పోతాం, గోస పడుతాం.. బీఆర్ఎస్ ప్రభుత్వం
 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు భీమా, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాధి ముబారఖ్ లాంటి అన్ని పథకాలు కట్ అవుతాయి అని అన్నారు. కేసిఆర్  అభివృద్ధి కళ్ళ ముందు ఉంది.. ఎన్నడూ లేనివిధంగా తాండూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి 50 లక్షలు ఇచ్చాము.అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రెయిన్లు, హైమాస్ లైట్లు ఏర్పాటు చేశాము. రూ.1680 కోట్లతో అభివృద్ధి పనులు జరుగతున్నాయి అని అన్నారు. మన వేలితో మన కంటిని పొడుసుకోవద్దు.. మన సంసారం మనం చక్కదుద్దుకుందాం.. మన బాధ బయటోనికి ఏమి అర్థం అవ్తది అని అన్నారు.