తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇళ్లపై ఐటి శాఖ దాడులు

తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇళ్లపై ఐటి శాఖ దాడులు

తనిఖీల్లో రూ. 44 లక్షలు, కీలక పత్రాలు స్వాధీనం

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇళ్లలో ఐటీ శాఖ శనివారం తనిఖీలు చేపట్టింది. పైలెట్ రోహిత్ రెడ్డి కి సంబంధించిన తాండూర్ లోని స్వగృహంలో, అలాగే హైదరాబాద్ మణికొండలోని స్వగృహంలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్వగృహంలో రూ. 20 లక్షల నగలతో పాటు కీలక పత్రాలను ఐటి శాఖ స్వాధీనం చేసుకుంది. అలాగే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సోదరుడు  రితీష్ రెడ్డి వద్ద నుంచి కూడా రూ. 24 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. కాగా తాండూరు పట్టణ శివారులోని ఓ కాలనీలోనీ ఇంటిలో రహస్యంగా పెద్ద ఎత్తున నోట్ల కట్టలు దాచి ఉంచిన డబ్బు విషయమై కూడా ఐటి శాఖ ఆరా తీసినట్లు సమాచారం. ఎన్నికల సందర్భంగా ఐటీ శాఖ ఈ దాడులు జరపడం గమనార్హం. అలాగే తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డికి సంబంధించిన హైదరాబాద్లోని కార్యాలయాల్లో కూడా ఐటీ శాఖ తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది.