కూరగాయల వ్యాపారులకు అండగా ఉంటా

కూరగాయల వ్యాపారులకు అండగా ఉంటా
  • ఎండా.. వానకు సోదరీమణులు  పడుతున్న ఇబ్బందులు చూడలేకే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం
  • మనలాంటి  ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దేశంలో మరెక్కడా లేదు
  • మార్కెట్ నిర్వహణలో మహిళా వ్యాపారుల సూచనలను శిరసా వహిస్తా

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: దేశంలో ఎక్కడా లేనివిధంగా సూర్యాపేట లో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న  ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్వాహణలో కూరగాయల  వ్యాపారాలు చేసే సోదరీమణుల సూచనలను శిరసావహిస్తానని బిఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ.. మహిళా వ్యాపారులు పడుతున్న ఇబ్బందులు చూడలేకే మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టానని పేర్కొన్నారు. ఇలాంటి మార్కెట్ దేశంలో మరెక్కడా లేదన్నారు. గత పాలనలో రౌడీ మాములు బెదిరింపులతో బిక్కుబిక్కుమంటూ వ్యాపారాలు చేసుకున్న పరిస్థితులు ఉంటే, నేడు ప్రశాంత వాతావరణంలో మహిళలు వ్యాపారాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. వ్యాపారులకు అండగా ఉంటానన్న మంత్రి, రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ఆశీర్వదించాలని కోరారు.