తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి అధికారుల సత్కారం

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి అధికారుల సత్కారం

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని నియోజకవర్గంలోని వివిధ ప్రభుత్వ శాఖలు పోలీస్ శాఖల అధికారులు సిబ్బంది మంగళవారం ఎమ్మెల్యే స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు ఎమ్మెల్యేను శాలువాలు పూలమాలల తో సత్కరించారు. తాండూరు పంచాయితీ రాజ్ , వ్యవసాయ శాఖల అధికారులు   ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే తాండూరు నియోజకవర్గ పరిధిలోని తాండూరు మండలం గౌతాపూర్, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్ పోలీస్ స్టేషన్ల ఎస్ఐ లు కూడా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జడ్పిటిసి సభ్యులు ధారాసింగ్, తాండూరు మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ చంద్,బషీరాబాద్ మండలం కాంగ్రెస్ నాయకులు అజయ్ ప్రసాద్, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మురళి  గౌడ్ తదితరులు ఉన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు ఉన్న సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించేందుకు చొరవ చూపాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అధికారులను కోరారు.