చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన మాజీ మంత్రి  డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, కే ఏ పాల్

చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన మాజీ మంత్రి  డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, కే ఏ పాల్

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:తుంటి ఎముక సర్జరీ అనంతరం హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించిన మాజీ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సోదరులు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తదితరులు మంగళవారం పరామర్శించారు ఈ సందర్భంగా వారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ముచ్చటించి,కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో అడిగి తెలుసుకుని ఆయన త్వరగా కోలుకోవాలని  పట్నం బ్రదర్స్ ఆకాంక్షించారు.

మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్

కాగా మాజీ సీఎం కేసీఆర్  ను ఇదే సందర్భంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా పరామర్శించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మాట్లాడి సీఎం కేసీఆర్  ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థన కూడా చేశారు.