బెక్కెం గూడెం గ్రామాల మీదగా ఆర్టిసి బస్సు

బెక్కెం గూడెం గ్రామాల మీదగా ఆర్టిసి బస్సు

ముద్ర/ వీపనగండ్ల:-ఉమ్మడి వీపనగండ్ల మండలంలోని బేక్కం గూడెం గ్రామాల మీదుగా కొల్లాపూర్– పెబ్బేరు పట్టణాలకు కొల్లాపూర్ ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం కల్పించారు. గత కొన్ని సంవత్సరాలుగా బస్సు సౌకర్యం లేక నరకయాతన అనుభవించామని పలుమార్లు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు. చిన్నంబాయి మండల కేంద్రం నుంచి బెక్యం గూడెం గ్రామాల మీదుగా పెబ్బేరుకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన మంత్రి జూపల్లి కొల్లాపూర్ ఆర్టీసీ అధికారులతో  మాట్లాడి మంగళవారం నుంచి బస్ సౌకర్యం కల్పించినందుకు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో  వంటల రంగస్వామి , బత్తుల నారాయణ, గొందిపర్ల గోవింద్ వెంకటస్వామి కుమ్మరి భిచ్చన్న ఆర్ కుర్మయ్య మొగిలి ఈశ్వరయ్య పెద్ద గాలెన్న సతీష్ యాదవ్, మద్దూరు చిన్న కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.