మాజీ డీజీపీ అంజనీకుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేత

మాజీ డీజీపీ అంజనీకుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేత

ముద్ర,తెలంగాణ:-అంజనీకుమార్ కు బిగ్‌ రిలీఫ్‌ దక్కింది. తాజాగా IPS అధికారి అంజనీకుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేశారు. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదన్న అంజనీకుమార్ విజ్ఞప్తిని CEC పరిగణనలోకి తీసుకుంది. ఎన్నికల ఫలితాల రోజు రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని.. ఇలాంటిది మరోసారి జరగదని CECకి అంజనీకుమార్ హామీ ఇచ్చారు. దీంతో సస్పెన్షన్ ఎత్తివేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి CEC సమాచారం ఇచ్చింది.