సింగిల్ విండో సిబ్బంది గైర్వాజరుపై సర్వత్ర విమర్శలు..

సింగిల్ విండో సిబ్బంది గైర్వాజరుపై సర్వత్ర విమర్శలు..
  • విహార యాత్రకు వెళ్లరంటూ ప్రచారం
  • 8 మంది ఉద్యోగులకు గాను ఇద్దరు మాత్రమే విధులలో
  • విచారణ చేపట్టిన జిల్లా అధికారులు

ముద్ర,పానుగల్:-పానుగల్ మండల సింగిల్ విండో సిబ్బంది ఒకే రోజు ఆరుగురు సిబ్బంది గైర్వాజరు కావడం పట్ల సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి.సింగిల్ విండో సిబ్బంది అందరూ పని దినం రోజులలో విహారయాత్రలకు వెళ్ళరంటూ ప్రచారం జరగడం జిల్లా అధికారులకు సమాచారం వెళ్లడంతో శుక్రవారం డి సి ఓ ఆదేశాల మేరకు జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి కిరణ్ కుమార్ పానగల్ సింగిల్ విండో కార్యాలయానికి చేరుకొని రిజిస్టర్లను పరిశీలించారు కొంతమంది సిబ్బంది నిన్నటి నుండి సెలవులు ఉండగా మరికొంతమంది సిబ్బంది శుక్రవారం సెలవులో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్నారు. వీరంతా విహారయాత్రకు వెళ్లారని సమాచారం ప్రచారం కావడంతోనే డిసిఓ ఆదేశాల మేరకు సింగిల్ విండో కార్యాలయానికి పరిశీలించేందుకు రావడం జరిగిందని ఆయన తెలిపారు.నోడివ్ సర్టిఫికెట్లు, ఇతర అవసరాల నిమిత్తం రైతులు సింగిల్ విండో కార్యాలయానికి రావటంతో పానగల్ విండో సీఈవో తోపాటు ఐదుగురు సిబ్బంది గత రెండు రోజులుగా కార్యాలయానికి రావటం లేదని సమాచారంతో ఇంచార్జి డిసిఓ రఘునాథరావు విచారణకు ఆదేశించారు. సీఈవో భాస్కర్ గౌడ్ తో పాటు ఐదుగురు సిబ్బంది గత రెండు రోజులుగా హాజరు రిజిస్టర్ లో సంతకాలు చేయలేదని తెలింది. కార్యాలయానికి గైరహాజరైన అధికారులు సిబ్బంది ఎక్కడికి వెళ్లారని కార్యాలయంలో ఉన్న ఇద్దరు సిబ్బందిని జూనియర్ అసిస్టెంట్ కిరణ్ కుమార్ వివరణ కోరగా సెలవులో ఉన్నారని తెలిపారు. సెలవుకు సంబంధించిన లెటర్ ఎక్కడ ఉందని అడగారు.పానగల్ సింగిల్ విండో కార్యాలయ అధికారులు, సిబ్బంది కార్యాలయానికి గైర్హాజరు అయిన దానిపై జిల్లా అధికారులకు తెలపటం జరిగిందన్నారు.