గంబుసియా ఫిష్ పాండ్, ఫ్రైడే డ్రై సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి

గంబుసియా ఫిష్ పాండ్, ఫ్రైడే డ్రై సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి

 ముద్ర ప్రతినిధి,  వనపర్తి : వనపర్తి జిల్లా పెబ్బేర్ మున్సిపల్ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గాంబుషియ ఫిష్ పాండ్ ను సందర్శించి వాటిలోని చేపలు పెరుగుదలను వాటికి ఆహార ధాన్యమును పరిశీలించినారు, ఈ వనపర్తి జిల్లాలో ఇలాంటివి మదనాపురం, పెద్దమందడి, పెబ్బేరులో ఈ ఫిష్ పాండ్ లను నిర్మించినాము, వచ్చే వర్షాకాలము లో ఎక్కడైతే నీళ్లు నిలువ ఉంటావో అక్కడ దోమలు గుడ్డు తినడానికి ఈ గంబుషియ చేపలను వదులుతాము, అలాగే పెబ్బేరు మున్సిపల్ పరిధిలోని పదో వార్డులో ఫ్రైడే  కార్యక్రమం సందర్శించి ప్రతి ఇంటి లోపల సిమెంట్ ట్యాంకుకలో, పాత టైర్లు, ఎయిర్ కూలర్ లో, పులా కుండీలో, నీరు నిలవకుండా ఉండాలని అక్కడున్న వైద్య సిబ్బందికి సూచించినారు.

ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ రాకేష్ రెడ్డి, జిల్లా సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్ జీ, హెల్త్ సూపర్వైజర్ సూర్యనారాయణ, హెల్త్ అసిస్టెంట్ రాజశేఖర్, లక్ష్మి రెడ్డి, గంధము రాజు, డాటా ఎంట్రీ ఆపరేటర్ రాజేష్ గౌడ్, ఏఎన్ఎం వెంకటమ్మ, ఆశ కార్యకర్తలు చెన్నమ్మ, గోవిందమ్మ, నరసింహ, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.