రోహిత్ రెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలి

రోహిత్ రెడ్డిని భారీ మెజార్టీ తో గెలిపించాలి


  • ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి ముమ్మర ప్రచారం
  • మీ ఆశీర్వాద బలమే విజయానికి పునాది

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని భారీ మెజా ర్టీతో గెలిపించాలని ఆయన సతీమణి ఆర్తి రెడ్డి కోరారు. మంగళవారం తాండూరు పట్టణంలోని 27వ వార్డులో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తరుపున ఆయన సతీమణి ఆర్తి రెడ్డి చేసిన ప్రచారం లో అభివృద్ధి పనులు చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి ని భారీ మెజార్టీ తో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. తాండూర్ పట్టణంలో వార్డులో ఆర్తీ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ కరపత్రాలను పంచి కారు గుర్తును గుర్తించుకోవాలన్నారు. ప్రజల ఆశీర్వాదంతో, యువకులు అభిమానంతో ఓటేసి ఎన్నికల్లో రోహిత్ రెడ్డికి భారీ మెజార్టీ అందించాలన్నారు. కాంగ్రెస్ మాట లను నమ్మి దగా పడి ఇబ్బంది పడద్దని సూచించారు. ప్రజా ఆశీర్వాదమే పైలెట్ రోహిత్ రెడ్డి విజయానికి పునాదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ వీణా శ్రీనివాస్ చారి, కౌన్సిలర్ సంగీత ఠాకుర్ తదితులున్నారు.