వికారాబాద్ లో పోలీస్ చెకింగ్..!

వికారాబాద్ లో పోలీస్ చెకింగ్..!
Police checking in Vikarabad..!

ముద్ర, ప్రతినిధి వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ రైల్వే స్టేషన్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి వివరిస్తూ... జిల్లాలో సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా బీడీ(బాంబ్ డిస్పొసల్) టీం అధికారులచే వికారాబాద్ పట్టణంలోని బస్టాండ్,రైల్వే స్టేషన్ మార్కెట్ లు ప్రజలు గుంపులుగా ఉండే ప్రతి చోట్ల చెకింగ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు.

జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టామన్నారు. ఇకముందు కూడా జిల్లాలో అకస్మాత్తుగా చెకింగ్ కార్యక్రమాలు కొనసాగ నున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా అనుమానాస్పదమైన వస్తువులు గాని, వ్యక్తులు గాని, సూట్ కేసులు ఏమైనా కనబడితే వెంటనే పోలీసు 100 డయల్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు ఎస్పీ సూచించారు.