అనంతగిరిలో వన్య ప్రాణులకు రక్షణేది...? | Mudra News

అనంతగిరిలో వన్య ప్రాణులకు రక్షణేది...? | Mudra News

ముద్ర,ప్రతినిధి వికారాబాద్: వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులు నిత్యం రోడ్డు ప్రమాదాలకు గురై మృత్యు వాత పడుతున్నాయి. మంచి నీరు దొరక్క అడవిలో నుండి రోడ్ల పైకి వస్తున్నాయి. అటవీ ప్రాంతంలో  వన్య ప్రాణులు రోడ్డు దాటుతాయి నెమ్మదిగా వెళ్ళాలి అని రోడ్డుకు ఇరువైపులా సూచిక బోర్డులను ఏర్పాటు చేసినా అవేమీ పట్టనట్టు అధిక వేగంతో వెళుతూ వన్య ప్రాణుల ప్రాణాలను బలి గొంటున్నారు.తాజాగా శుక్రవారం అటవీ ప్రాంతంలో దర్గా సమీపంలో అడవి జింక రోడ్డు దాటుతూ వాహనం ఢీకొట్టి మృతి చెందింది. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా రావడానికి గంట సమయం పట్టడంతో జింక ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు చెబుతున్నారు.గతంలో ఎన్నో జింకలు మృతి చెందాయి.అయితే కుక్కల దాడిలో జింకలు మృతి చెందాయనీ రికార్డులు రాసి పెడుతున్నట్టు జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు. ఫారెస్ట్ పెద్ద సార్లు కింది స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.