రాష్ట్రంలో అధికారం లోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే

రాష్ట్రంలో అధికారం లోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
  • ప్రతి కార్యకర్త కష్టపడి పని చేస్తే విజయం మనదే 
  • తాండూరులో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనేి తాండూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా ఉందని, ఏఐసీసీ పీసీసీ ఆదేశాల మేరకే తాను తాండూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమైనట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో  నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.  నియోజకవర్గం లోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు తాను న్యాయం చేస్తానని అన్నారు అయితే ఎన్నికలు జరగనున్న 30 రోజులపాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సైనికుల పనిచేసే తన గెలుపుకు కృషి చేస్తే పాలు ఐదేళ్లపాటు తాండూర్ నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా సేవలందిస్తానని అన్నారు.

తాండూర్లో కాంగ్రెస్ పార్టీలో గ్రూపులకు తావు లేదని అందరూ కలిసికట్టుగా పని చేద్దామని పిలుపు నిచ్చారు. 32 ఏళ్లపాటు తాను రాజకీయాల్లో వివిధ పదవులు అనుభవించానని ఏ పార్టీలోనూ ,ఏ పదవిలోనూ ఉన్న అందుకు న్యాయం చేయడమే ధ్యేయంగా తాను పని చేశారని అన్నారు. తాండూర్ నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి అనుమానం వద్దు. తాను గెలిచాక పార్టీ మారేది లేదు ప్రాణం పోయినా పార్టీ మారను చావనైనా చస్తాను కానీ పార్టీని మారతానన్న ప్రచారం వాస్తవం కాదని అన్నారు .

తాండూర్ నియోజకవర్గంలో ప్రతి కాంగ్రెస్ నాయకులు కార్యకర్త అభ్యున్నతికి అన్ని విధాలుగా కృషి చేస్తానన్నారు . 40 నుంచి 50ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులందరూ, కార్యకర్తలందరూ తాండూర్ నియోజకవర్గంలో ఉన్నారని మనోహర్ రెడ్డి చెప్పారు. పార్టీని కొందరు నాయకులు వదిలి వెళ్ళినా  కష్టపడి పార్టీని కాపాడిన కార్యకర్తల కష్టాన్ని కి తాను ప్రాధాన్యత ఇచ్చి పని చేస్తానన్నారు. అనుమానం వద్దు ప్రమాణం చేసి చెబుతున్న, కింది స్థాయి నుంచి నేను రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చా కలిసి పనిచేసి విజయం సాధిద్దామని మనోహర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవకపోతే భవిష్యత్తు ఉన్నదని అన్నారు. ఉద్యోగాలపై బీఆర్ఎస్ ప్రభుత్వం మాట తప్పిందని అందరినీ మోసం చేసిందని విమర్శించారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డిసిసి ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సిపాయిగా పనిచేయాలని కోరారు. అధిష్టానం ఎవరికీ టికెట్టు ఇస్తే వారికి గెలుపు సాధించి పెట్టేందుకు కృషి చేస్తామని అన్నారు .గ్రామాల్లో కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను ప్రచారం చేయాలని కోరారు. సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఐక్యత భావంతో కాంగ్రెస్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఉత్తమ చంద్ మాట్లాడుతూ కాంగ్రెస్ విజయభేరి మోగించడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభ , మండలం వైస్ ఎంపీపీ మధులత, నాయకులు  నర్సింలు గౌడ్, హబీబ్ లాల,భీమయ్య జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి తదితులున్నారు.