ప్రాజెక్ట్ నీటి లోకి దూసుకళ్లిన కారు

ప్రాజెక్ట్ నీటి లోకి దూసుకళ్లిన కారు
  • నలుగురు ప్రయాణికులు సురక్షితం 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:పొగ మంచు కారణంగా తాము వెలుతున్న రహదారి మార్గం సరిగ్గా కనిపించక పోయేసరికి ఓ కారు రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో కారులో నలుగురు ప్రయాణికులు ఉండగా వారు సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ ఉదంతం వికారాబాద్‌- హైదరబాద్ రోడ్డు మార్గంలోని శివారెడ్డి పేట ప్రాజెక్ట్ వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన పర్యాటకులు ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న అనంతగిరి కొండలను చూసేందుకువచ్చి మరుసటి రోజు తిరిగి పయనమయ్యారు. సోమవారం ఉదయం వారు తమ కారులో హైదరాబాద్ కు తిరిగి వ్యక్తులు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

మంచు కారణంగా రోడ్డు కనిపించకగా ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. అందులోని కారు డ్రైవర్‌తో పాటు నలుగురు ప్రయాణికులు కారులో నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు. స్థానికుల కథనం మేరకు.. హైదరాబాద్‌ ప్రాంతానికి చెందిన పర్యాటకులు ఇక్కడి అనంతగిరికి వచ్చి మరుసటి రోజు తిరిగి వెళుతుంటారు. ఇదే క్రమంలో సోమవారం ఉదయం ఓ కారులో నలుగురు వ్యక్తులు వెళుతున్నారు.ఉదయం పూట కురుస్తున్న మంచు కారణంగా ముందు ఉన్న రోడ్డు సరిగా కనిపించక పోవడంతో కారు అదుపు తప్పి శివరెడ్డిపేట ప్రాజెక్ట్ నీటి లోకి దూసుకెళ్లింది. వెంటనే కారులో ఉన్న నలుగురు వ్యక్తులు అప్రమత్తమై బయటకు వచ్చారు. ఈ సమాచారం అందడంతో సంఘటన స్థలానికి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చెరువు వద్దకు చేరుకుని కారును చెరువులో నుంచి జెసీబీ తో బయటకు తీయించారు. ఈ ప్రమాదంలో ఇంకా ఇతర వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని  పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వారు తెలిపారు.