నల్గొండ జిల్లాలో రక్తసిక్తమైన రోడ్డు

నల్గొండ జిల్లాలో రక్తసిక్తమైన రోడ్డు

ముద్ర,నల్గొండ:- నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. ఆదివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కకడే మృతి చెందారు. నిడమనూరు మండలం వేంపాడు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు టాటా ఏస్ వాహనంలో ప్రమాదస్థలికి బయలుదేరారు. వీరి వాహనాన్ని ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. సోమవారం తెల్లవారుజామున నిడమానురు మండలం వేంపాడు సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదాల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు.