సుందరయ్య జీవితమే ఓ విప్లవ సందేశం

సుందరయ్య జీవితమే ఓ విప్లవ సందేశం

నాగారపు పాండు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు

హుజూర్నగర్ ,ముద్ర: సుందరయ్య జీవితమే ఓ విప్లవ సందేశంఅని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగారపు పాండు అన్నారు. శుక్రవారం సుందరయ్య 38వ వర్ధంతిని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుందరయ్య జీవితంలో పార్టీ నిర్మాణమైన పార్లమెంటరీ రాజకీయాలైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమైన ఏదశలోనైనా ఆయన ప్రజలతో మమేకమై పనిచేశార న్నారు. ఆయన పార్టీ శ్రేణులకే కాక పార్టీ ఏతర శ్రేణులకు, నాటి,నేటి ప్రజా ప్రతినిధులకు ఆదర్శనేత సుందరయ్య అన్నారు. ఆయన ఆశయాలు ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి కార్యకర్త ప్రతిన బూనాలన్నారు.

ప్రపంచంలోనే ఆయన కమ్యూనిస్టు గాంధీగా చెప్పుకునే నేత అని నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి,భుక్తి,విముక్తి కోసం సాగిన పోరాటం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిందన్నారు. నేడు సాగుతున్న రైతాంగ పోరాటాలు గుడిసెల పోరాటాలు నాటి ఆయన పోరాటాలే ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, దుర్గి బ్రహ్మం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు శీలం శ్రీను,  తుమ్మకొమ్మ యోన, రేపాకుల మురళి, చిన్నం వీరమల్లు, కౌన్సిలర్ ఇందిరాల త్రివేణి, పార్టీ సీనియర్ నాయకులు పిట్టల నాగేశ్వరరావు, పాశం వెంకటనారాయణ, తురక వీరయ్య,పట్టణ కమిటీ సభ్యులు శీలం సాంబయ్య,శీలం వెంకన్న, ఎలకా సోమయ్య గౌడ్,రేపాకుల వీరస్వామి,గణపవరపు శ్రీను, చింతకాయల పర్వతాలు,పాశం వీరబాబు,ముషిని శంబయ్య,కోలా సైదులు,శంభయ్య తదితరులు పాల్గొన్నారు.