రైతులు యువతలో చైతన్యం తీసుకురావడమే ప్రధాన లక్ష్యం

రైతులు యువతలో చైతన్యం తీసుకురావడమే ప్రధాన లక్ష్యం
  • పంట ఉత్పత్తుల విక్రయానికి మార్కెటింగ్ సౌకర్యంతో పాటు మద్దతు ధరలు కల్పించేందుకు కృషి చేస్తా
  • ప్రతినిరుద్యోగికి ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తా వికారాబాద్ జిల్లా తాండూరు
  • భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థి ధర్మపురం రామచంద్రయ్య

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:రైతులు, యువతలో చైతన్యం తీసుకువచ్చి వారి సంక్షేమానికి కృషి చేస్తానని తాండూర్ అసెంబ్లీ భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థి ధర్మపురం రామచంద్రయ్య వెల్లడించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. తాండూర్ మెయిన్ మార్కెట్లో వ్యాపారస్తులను వినియోగదారులను మౌఖికంగా కలుసుకుని తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా తాండూర్ పట్టణంలోని భద్రేశ్వర చౌక్లో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. రైతులు యువతలో చైతన్యం వస్తేనే పాలన సుభిక్షంగా ఉంటుందని రామచంద్రయ్య పేర్కొన్నారు. రైతులకు మద్దతు ధరలు లభిస్తేనే వారి జీవితాలు బాగుపడతాయని, అలాగే నిరుద్యోగులకు ఉపాధి కల్పన నిరంతరం కొనసాగితేనే వారి జీవితాలు ఆర్థికంగా అభివృద్ధికి నోచుకుంటాయని అన్నారు. ఒక పీజీ చేసిన విద్యావంతునిగా తాను కోరుకునే లక్ష్యం ఒక్కటే నిరుద్యోగం రూపుమాపాలన్నదే తన ఆశయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్క నిరుద్యోగికి ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో కచ్చితంగా ఉపాధి కల్పన  ధ్యేయంగా తాను పని చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులకు రైతులకు గిట్టుబాటు ధరలు ,మద్దతు ధరలు కల్పించడంలో పాలకులు దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. రైతుల పండించిన పంట ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధరలు లభిస్తేనే రైతు కుటుంబం పడడంతో పాటు నాణ్యమైన పంట ఉత్పత్తులు పండించుకోవచ్చని వెల్లడించారు. తాండూర్ నియోజకవర్గంలో ప్రధానంగా రోడ్లు కాలుష్యం సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెరుకు రైతు గుర్తుకు ఓటు వేసి తనకు గెలిపిస్తే తాను ఒక విద్యావంతుడిగా తాండూర్ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని ధర్మపురం రామచంద్రయ్య వెల్లడించారు. తాండూర్ పట్టణంలోని శివాజీ చౌక్ విలియమున హైస్కూల్ గాంధీ చౌరస్తాల మీదుగా భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థి రామచంద్రయ్య ప్రచారం నిర్వహించి అందరిని ఆకట్టుకున్నారు.