ప్రజల ఆరోగ్యం, సంరక్షణ  ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ప్రజల ఆరోగ్యం, సంరక్షణ  ప్రభుత్వ లక్ష్యం:  మంత్రి శ్రీనివాస్ గౌడ్

జడ్చర్ల ,ముద్ర :  ప్రజల ఆరోగ్య సంరక్షణే తమ లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని ఎవరిని ఉపేక్షించబో మ ని ,ఏది కల్తీ చేసిన వదిలిపెట్టబోమ ని  అన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే ఊరుకోమని అన్నారు. మహబూబ్నగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో కల్తీకల్లుతో ఇద్దరు చనిపోయారని మీడియా ఛానళ్లలో వార్తలు వచ్చిన నేపథ్యంలో బుధవారం ఆయన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని సూపరింటిన్డెంట్ ఛాంబర్ లో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఆయా వార్డులలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా  చనిపోయిన వారు ఎలా చనిపోయా రున్నది తెలుస్తుందని మంత్రి తెలిపారు. ఎవరైనా కల్తీకల్లు వల్ల చనిపోయారని తెలిస్తే  అందుకు కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడిం చారు.చనిపోయిన ఇద్దరిలో ఒకరు ప్రమాదానికి గురయ్యారని, లివర్ పాడైపోవడం, వివిధ కారణాలవల్ల చనిపోయారని, ఇంకొక వ్యక్తి అనాథ  అని,అతనికి తరచూ ఫీట్స్ వచ్చేవని, శరీరంలో చాలా అవయ వాలు దెబ్బతిన్నందువలన చనిపో యారని తెలిపారు. ఇందుకు సంబంధించి ఎఫ్ ఐ ఆర్ తో పాటు , వారి బంధువుల రిపోర్టు కూడా ఉందని వెల్లడించారు.

తమ ప్రభుత్వం నిక్కచ్చిగా పనిచేస్తుం దని, ప్రజల ఆరోగ్యంతో ఎవరైనా చేలాగాతమడితే ఊరుకోబోమని, అస్సాం నుండి లిక్కర్ వస్తుందని గతంలో తమకు సమాచారం అందితే ఇక్కడి అధికారులు అక్కడికి వెళ్లి పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజల ఆరోగ్యాలను కాపాడటమే తమ లక్ష్యం అన్నారు.మహబూబ్ నగర్  ప్రభుత్వాసుపత్రిలో ఎంతో మార్పు వచ్చిందని ,వైద్య సదుపాయాలు, సౌకర్యాలు మెరుగుపడ్డాయని అన్నారు. 500 కోట్ల రూపాయలతో పాత కలెక్టరేట్ స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నా మని మంత్రి వెల్లడించారు.ఆయా టీవీలలో వచ్చిన కథనాలపై ఆసుపత్రి సూపరింటినెడెంట్ తో పాటు, ఎక్సైజ్  సూపరింటిండెంట్ తో విచారణ చేయనున్నామని, ప్రజల ప్రాణాల పరిరక్షణలో భాగం గా కల్తీ కళ్ళు అన్నది లేకుండా చెట్లు పెంచడమే కాకుండా, నీర పాలసిని తీసుకొచ్చామని అన్నారు .

కల్తీ కల్లు వల్ల చనిపోయినట్లు ఆధారాలు ఉంటే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు .జిల్లాలో కల్తీకల్లు వల్ల చనిపోతే మంత్రి స్పందించడం లేదన్నది అబద్ధమని, రిపోర్టులు వచ్చిన తర్వాత పకడ్బందీ చర్యలు చేపడతామని ,తాము అన్ని పను లు పారదర్శకంగా తీసుకుంటామని, ప్రజలను అసత్యాలతో మభ్య పెట్టకూడదని ఆయన అన్నారు. కల్తీ వల్ల చనిపోతే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని, ఎవరిని వదిలి పెట్టమని, అవసరమైతే క్రిమినల్ కేసు నమోదు చేస్తామ ని , ఎఫ్ఎస్ ఎల్ రిపోర్టు రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటివరకు 64 శాంపిల్స్ ని పరీక్షలకు పంపడం జరిగిందని ఏ శాంపిల్లో కల్తీ వచ్చినా చర్య తీసుకుంటామన్నారు. ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ రాంకిషన్, వైద్యులు జీవన్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింలు ,ఇతర ప్రజాప్ర తిని ధులు, అధికారులు పాల్గొన్నారు .