పేలింది రెండో సిలిండర్: కారేపల్లి ఘటనలో మరో కోణం తెలంగాణక్రైమ్

పేలింది రెండో సిలిండర్: కారేపల్లి ఘటనలో మరో కోణం తెలంగాణక్రైమ్

కారేపల్లి: టిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా పార్టీ శ్రేణులు కాల్చిన బాణాసంచా వల్ల ఆ నిప్పు రవ్వలు ఎగిసిపడి ఓ పూరి గుడిసె పై పడటం ఆ గుడిసెకు అగ్నిప్రమాదం జరిగి అందులో ఉన్న సిలిండర్ పేలడంతో ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. వాస్తవానికి ఆ గుడిసెలో రెండు సిలిండర్లు ఉన్నాయి.

వాటిలో ఒకదాన్ని అక్కడే ఉన్న శంకర్ అనే హోంగార్డు బయటకు తెచ్చారు. కానీ, దానికి దగ్గర్లోనే బీరువా పక్కన ఉన్న సిలిండరు ఆయన చూడలేదు. చూస్తే దాన్నీ బయటకు తెచ్చేవారు. ఇంత విషాదం జరిగేదికాదు. ఆ రెండో సిలిండరే ఇంతటి ప్రమాదానికి కారణమైందని ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.