మంత్రి అజయ్ కుమార్ నామినేషన్ పై  కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల అభ్యంతరం 

మంత్రి అజయ్ కుమార్ నామినేషన్ పై   కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల అభ్యంతరం 
  • ప్రొఫార్మా ప్రకారం లేదని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు
  • ఆర్వో ఆదర్శ సురభి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ

ఖమ్మం, ముద్ర: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీ ఆర్ ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ నామినేషన్ పై కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి , మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం నామినేషన్ల స్క్రూట్ ని జరుగుతుండగా అజయ్ కుమార్ నిబంధనలు పాటించకుండా నామినేషన్ ఫైల్ చేసినట్లు తుమ్మల రిటర్నింగ్ ఆఫీసర్ తో పాటు ఎన్నికల అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ అంశాలను వివరిస్తూ తుమ్మల మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఫార్మెట్ లో కాకుండా బీ.అర్.ఎస్ అభ్యర్థి  మార్చి ఇచ్చారని ఆరోపించారు. 
డిపెండెంట్ కాలమ్ లో ఎవ్వరు లేకపోతే నిల్ రాయకుండా మార్చారని అన్నారు.  కాలంలు ఉండాల్సి ఉండగా ఆరు కాలంలో పూర్తిచేసి ఇచ్చారని చెప్పారు. ఆర్.వో అయిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ సురభి ఎన్నికల నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. జరిగిన సంఘటనపై న్యాయపోరాటంతో పాటు ఆర్.వో పై కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు తుమ్మల తెలిపారు.