వివాదాల నేపద్యంలో... ఎన్ టిఆర్ విగ్రహం లో మార్పులు

వివాదాల నేపద్యంలో... ఎన్ టిఆర్ విగ్రహం లో మార్పులు

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: జిల్లా కేంద్రం ఖమ్మం నగరంలో ని లకారం ట్యాంక్ బండ్ లో శ్రీ కృష్ణుడు రూపంలో ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు 54 అడుగుల భారీ విగ్రహ ఏర్పాటు పై హై  కోర్టు ఉత్తర్వులు, యాదవ సంఘాల ను గౌరవిస్తూ ఎన్ టిఆర్ విగ్రహం రూపు లో మార్పులు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నీలిమేఘ శ్యాముడు గా ఉన్న శ్రీ కృష్ణుడు కి కలర్ మార్చి గోల్డ్ కలర్ వేయిస్తామని పేర్కొన్నారు.  విగ్రహం లోని   కిరీటంలో ఉన్న నెమలి పించం, కిరీటం వెనుక భాగంలో ఉన్న  విష్ణు చక్రం, పిల్లన గ్రోవీ లను తొలగిస్తామని చెప్పారు. ముందుగా ప్రకటించిన విధంగాఈ నెల 28న విగ్రహా ఆవిష్కరణ జరుగుతుందన్నారు. జూనియర్ ఎన్ టిఆర్  సినీరంగ ప్రముఖులు, ఎన్ ఆర్ ఐలు హాజరవుతారని తెలిపారు. విగ్రహానికి రూ.2.3 కోట్ల వ్యయం అవుతోందన్నారు.