ఖమ్మం జిల్లా కు చేరిన సీఎల్పీనేత భట్టి విక్రమార్క పాదయాత్ర

ఖమ్మం జిల్లా కు చేరిన సీఎల్పీనేత భట్టి విక్రమార్క పాదయాత్ర

ఖమ్మం జిల్లా కు చేరిన సీఎల్పీనేత భట్టి విక్రమార్క పాదయాత్ర

ముద్ర ప్రతినిధి , ఖమ్మం, కూసుమంచి : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బుధవారం రాత్రి కు ఖమ్మం జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్ గూడెం కు చేరింది. ఈ సందర్బంగా గజమాల, గిరిజన నృత్యాలు, మహిళా కోలాటాలు, డప్పు వాయిద్యాలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం గ్రామం నుంచి మొదలైన పాదయాత్ర 105 రోజుల్లో 36 నియోజకవర్గాలు, 600 గ్రామాలకు పైగా చుట్టేసి 1221 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్ర, ఏఐసిసి దిశా నిర్దేశం ప్రకారంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భగభగ మండే ఎర్రటి ఎండలను సైతం లెక్కచేయకుండా ఈ పాదయాత్ర చేపట్టారు.

జులై 2 న ఖమ్మం లోని రాహుల్ గాంధీ సభ తో భట్టి పాదయాత్ర ముగియనుంది. బుధవారం రాత్రి ఖమ్మం జిల్లా సరిహద్దు చేరుకున్న భట్టికి అపూర్వ స్వాగతం లభించింది. ఆయన సతీమణి మల్లు నందిని, పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, నగర కమిటీ అధ్యక్షుడు జావిద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. బుధవారం రాత్రి పాలేరులో భట్టి బస చేయనున్నారు. గురువారం ఉదయం పాలేరు నుంచి పాదయాత్ర మొదలు పెట్టి ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు వరకు కొనసాగనుంది. శుక్రవారం ఉదయం అక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. తన పాదయాత్ర కు చిహ్నంగా ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ ను భట్టి ఆవిష్కరించనున్నారు. శనివారం ఖమ్మం నగరంలోని వైరా రోడ్డు మీదుగా భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగనుంది. ఆదివారం ఖమ్మం నగర శివారు ఎస్ ఆర్ గార్డెన్ గ్రౌండ్ వద్ద రాహుల్ సమక్షంలో భట్టి పాదయాత్ర ముగింపు ప్రకటించనున్నారు.