8 మంది నిందితుల అరెస్టు.. రూ.67 లక్షల సొత్తు రికవరీ

8 మంది నిందితుల అరెస్టు.. రూ.67 లక్షల సొత్తు రికవరీ

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: దారి దోపిడి లకు పాల్పడే ఏడుగురు సభ్యులు , ఇళ్ళ చోరి చేసే ఓ నిందితుడు.. ఈ రెండు కేసుల్లో ఒక  కేజీ బంగారం, రూ. 17,50,000 నగదు రికవరీ చేసినట్లు పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ తెలిపారు. శుక్రవారం ఖమ్మంలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి కేసు వివరాలు వెల్లడించారు. ఖమ్మం కార్పొరేషన్ లోని పాండురంగాపురం చెందిన ప్రసాద్ 8 ఇళ్లల్లో చోరీ చేశాడు. ఎక్కువగా రాత్రి సమయంలో చోరీలు చేశాడు. ఇతని నుంచి 900 గ్రాములు బంగారం రూ 3 లక్షల నగదు మొత్తం 45 లక్ష రూపాయల విలువ గల సొత్తు రికవరీ చేసినట్లు సిపి తెలిపారు. జల్సాలు బెట్టింగ్ లకు అలవాటు పడి ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలు చేసినట్లు సిపి వివరించారు. అంతేగాక అధిక డబ్బు సంపాదించి మౌంట్ శిఖరం ఎక్కలనే ఉద్దేశం కూడా ఉందని సిపి పేర్కొన్నారు.

ఖమ్మం నగరంతో పాటు పలు గ్రామాలకు చెందిన విజయకుమార్, లక్ష్మీనారాయణ,  సైదులు, సిద్ధికి,  పర్వేజ్, ధర్మ తేజ,  సాయి లు ముఠాగా ఏర్పడ్డారు. ఖమ్మం నగర శివ ప్రాంతాల్లో కార్లు , బైకులు ఆపి వారిని బెదిరించి వారి వద్ద ఉన్న బంగారం, నగదు దోపిడీ చేశారు మొత్తం 8 చోట్ల దోపిడీలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వారి నుంచి 150 గ్రాముల బంగారం, రూ.14,50,000 నగదు మొత్తం 22 లక్షల సొత్తు రికవరీ చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. కేసు చేదించిన పోలీసులను కమిషనర్ అభినందించి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిసిఎస్ ఎసిపి రవి , ఖమ్మం నగర ఎసిపి గణేష్, ఖమ్మం రూరల్ ఎసిపి బసవ రెడ్డి, సిఐలు మల్లయ్య స్వామి , నవీన్ (క్రైమ్ స్టేషన్), శ్రీనివాసరావు (ఖమ్మం రూరల్) శ్రీధర్ ( టూ టౌన్) రామకృష్ణ( ఖా నాపురం హవేలీ) ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.