5 నుంచి మహిళా ఉద్యోగుల స్పోర్ట్స్, కల్చరల్ మీట్: టీఎన్జీవోస్ అధ్యక్షులు అప్జల్, కార్యదర్శి సాగర్

5 నుంచి మహిళా ఉద్యోగుల స్పోర్ట్స్, కల్చరల్ మీట్: టీఎన్జీవోస్ అధ్యక్షులు అప్జల్, కార్యదర్శి సాగర్

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: ఈ నెల 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను ప్రభుత్వ మహిళా ఉద్యోగులు విజయవంతం చేయాలని టీఎన్జీవో యూనియన్ జిల్లా అధ్యక్షులు షేక్.అప్జల్ హసన్ ,ప్రధాన కార్యదర్శి ఆర్.వి.ఎస్ సాగర్ పిలుపునిచ్చారు. గురువారం ఖమ్మం నగరంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో అప్జల్ హసన్ మాట్లాడుతూ నిత్యం మహిళలు తమ ఇంటి బాధ్యతను, మరో వైపు ఉద్యోగ విధి నిర్వహణ లతో  మానసిక ఒత్తిడితో ఉండే మహిళల్లో నూతనోత్తేజం నింపేందుకు టీఎన్జీవో ఆధ్వర్యంలో ఈ నెల 5వ తారీకు నుండి సర్దార్ పటేల్ స్టేడియం లో నిర్వహిస్తున్న స్పోర్ట్స్,కల్చరల్ ప్రోగ్రామ్ లలో అన్ని ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజవంతం చేయాలని కోరారు. అంతే గాక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీఎన్జీవో యూనియన్ కేంద్ర సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ళ రాజేందర్, రాయకంటి ప్రతాప్ చేతుల మీదుగా టీ ఎన్ జీ ఓ స్ జిల్లా డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ జరగనున్నట్లు చెప్పారు. సమావేశంలో టీఎన్జీవో యూనియన్ రాష్ట్ర అర్గనైజింగ్ సెక్రెటరీ నందగిరి శ్రీను, అసోసియేట్ ప్రెసిడెంట్ సుంచు వీర నారాయణ, టౌన్ అధ్యక్షులు షేక్.నాగుల్ మీరా, ట్రెజరర్ భాగం పవన్, మహిళా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శాబాసు జ్యోతి, స్వప్న, జిల్లా మరియు టౌన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ బుద్దా రామ కృష్ణ, ఆర్.ఎన్.ప్రసాద్, ఫోరమ్స్ అధ్యక్ష, కార్యదర్శులు మెడికల్ అండ్ హెల్త్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు కె.రమేష్ బాబు,ఐ. వెంకటేశ్వర్లు,అసోసియేట్ ప్రెసిడెంట్ ఎండీ. వలి, ట్రెజరర్ జి.పురుషోత్తంరెడ్డి, స్కూల్ ఎడ్యుకేషన్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు జి.ఎస్.ప్రసాదరావు,బి.నగేష్,

మున్సిపల్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు పి.లోకేష్, విజయ్ కె.శ్రీనివాస్,జి.శ్రీనివాస్,ల్యాండ్ రికార్డ్ ఫోరమ్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.లక్ష్మణ్, మురళి మోహన్, ఉమెన్ డేవేలప్మెంట్ మరియు చైల్డ్ వెల్ఫేయిర్ అధ్యక్ష, కార్యదర్శులు కె.రవి,బి.శివ రామకృష్ణ, ట్రెజరర్ టి. ప్రభావతి, మార్కెట్ కమిటీ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు తాడేపల్లి కిరణ్ కుమార్, ఇ. నరేష్ కుమార్,ట్రెజరర్ ఎండీ. హిమయత్ హుస్సేన్,కోపరేటివ్ ఫోరమ్ అధ్యక్షురాలు కె.శ్రీదేవి,వేటర్నిటీ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు ఆర్.ఎస్.జీవన్ బాబు,డి.వి.సత్యనారాయణ,హాస్టల్ వెల్ఫేయిర్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు కె.రుక్మరావు,ఎన్.నాగేశ్వరరావు, అగ్రికల్చరల్ ఫోరమ్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు ఎ. చంద్రశేఖర్, ఏ.బంగారయ్య,ఆడిట్ ఫోరమ్ నుంచి జనరల్ సెక్రెటరీ పబ్బరాజు జ్వాల నరసింహారావు,ఏఎన్ ఎమ్స్,పిహెచ్ ఎన్ఎస్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు డి.గీత,యం.విజయ,వైద్య విధాన పరిషత్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు పిరంగి శ్రీనివాసరావు,ఎస్. డి. హాబీబ్,ఇరిగేషన్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు యం.వెంకట్,సిహెచ్.నాగేశ్వరరావు, ఎంప్లాయీమెంట్, ట్రైనింగ్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు టి.వెంకటేశ్వర్లు,కె.స్వరూప,గ్రంథాలయ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు కె.వి.ఎస్.ఎల్.ఎన్.రాజు,ఎండీ. ఇమామ్,కాలేజ్ ఎడ్యుకేషన్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు గులాం అప్జల్,ఎ. నరేష్,ఫారెస్ట్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు కె.చంద్రశేఖర్ రావు,కె.అనిల్ కుమార్,ప్రొహిబిషన్,ఎక్సైజ్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు జి.విజయ్,కె.రాము,ఇరిగేషన్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు ఎండీ. మహమ్మద్ ఆలీ, జి.నరేష్,పోలీస్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు ఎస్.జానకిరామ్,జె.భాస్కర్ రెడ్డి,ట్రెజరర్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, వై.శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.