టియుడబ్ల్యుజె, ఐజెయు కృషితోనే జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాల హామీ...

టియుడబ్ల్యుజె, ఐజెయు కృషితోనే జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాల హామీ...
IJU TUWJ Effort
  • సిఎం కేసీఆర్, హరీశ్, పువ్వాడలకు  టియుడబ్ల్యుజె (ఐజెయ) కృతజ్ణతలు

ఖమ్మం.జనవరి 19: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలను నెల రోజుల వ్యవధిలోనే అందజేస్తామని ప్రకటించడం పట్ల టియుడబ్ల్యుజె ఐజెయు జిల్లా శాఖ హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. TUWJ- IJU చేసిన వినతి మేరకే ముఖ్యమంత్రి  ఖమ్మం నగరంలో బుధవారం జరిగిన బి ఆర్ ఎస్ అవిర్భావ సభలో ప్రకటించారు.సభకు రెండు రోజుల ముందు టియుడబ్ల్యుజె ఐజెయు శాఖ ప్రతినిధి బ్రందం ఖమ్మం నగరంలోని బి ఆర్ ఎస్ కార్యాలయంలో కలిసి జర్నలిస్టుల ఇళ్ళ స్ధలాల గురించి విన్నవించడం జరిగిందని,అంతేగాక బుధవారం నాటి సభలో ఖమ్మం జిల్లాకు వరాలను ప్రకటిస్తూ ఇంకా ఏమి కావాలన్ని సభికులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రశ్నించగా సభ వేధికకు దగ్గరగా ఉన్నా మీడియా గ్యాలరీలో కూర్చున్న ఐజెయు కు చెందిన ప్రతినిధులు జర్నలిస్టులకు  ఇళ్ళ స్ధలాలు కావాలని గట్టిగా కేకలు వేయడం, సభా వేధికపైనే ఉన్న హరీశ్ రావు ముఖ్యమంత్రికి జర్నలిస్టుల ఇళ్ళ స్ధలాల సమస్యను  ముఖ్యమంత్రి చెవిలో వేయడం వల్లనే ముఖ్యమంత్రి సభా వేధిక ద్వారా ప్రకటించారు. ఖమ్మం నగరంలోని జర్నలిస్టులందరికి ప్రభుత్వ స్ధలం ఉంటే ఇళ్ళ స్ధలాలు ఇవ్వాలని లేనిపక్షంలోప్రయివేట్ స్ధలాన్ని సేకరించి నెల రోజుల వ్యవధిలోనే ఈ పక్రియను పూర్తి చేయాలని వేధికపైనే ఉన్న రాష్ట్ర ఆర్దిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును, జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణ శాఖ మంత్రిని అదేశించారు.

   ఇది కేవలం ఐజెయు కృషి వల్లనే  ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామి లభించిందని టియుడబ్ల్యు జె, ఐజెయు పేర్కొంది కొన్ని ఏళ్ళుగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ళ స్ధలాల పై ముఖ్యమంత్రి  ఇచ్చిన ముఖ్యమంత్రి కెసి ఆర్ తోపాటు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి  తన్నీర్ హారీశ్ రావు, రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్లకు ఐజెయు నేతలు ప్రత్యేక ధన్యవాధాలు తెలిపారు. ముఖ్యమంత్రి గతంలో మాదిరిగా కాకుండా ఈ సారైనా ముఖ్యమంత్రి తన హామిని నిలబెట్టుకోవాలని  ఐజెయు నాయకులు కోరారు.

హర్షం వ్యక్తం చేసిన వారిలో టియుడబ్ల్యు జె ఐజెయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాంనారాయణ,జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వర్ రావు, జాతీయ నాయకులు రవీంద్రశేషు, ఎలక్ర్టానిక్ మీడియా రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ మాటేటి వేణుగోపాల్ రావు,  ఎస్ మురారీ, నగర అధ్యక్షులు మైసా పాపారావు, కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస రావు, ఎలక్ర్టానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, కార్యదర్శి కనకం సైదులు, జిల్లానాయకులు నల్లజాల వెంకట్రావు తదితరులు ఉన్నారు.