ఎకరానికి రూ.10 వేలు: ముఖ్యమంత్రి కేసీఆర్

ఎకరానికి రూ.10 వేలు: ముఖ్యమంత్రి కేసీఆర్

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి  చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని రామాపురంలో మొక్కజొన్న పంటలను సీఎం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. గంటలో నిధులు విడుదల చేస్తామని చెప్పారు. గాలివానతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,22,250 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా వేశామన్నారు. నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కెసిఆర్ పర్యటనలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సి పి ఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు