అగ్నివీరుల సైనిక ఎంపికలు ప్రారంభం

అగ్నివీరుల సైనిక ఎంపికలు ప్రారంభం

ఖమ్మం, ముద్ర: భారత సైన్యంలో అగ్నివీరుల ఎంపిక ప్రక్రియ ఖమ్మం నగరం లో  శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైంది. ఎస్.ఆర్ & బి.జి.ఎన్.ఆర్ మైదానం, సర్దార్ పటేల్ స్టేడియాన్ని రెండు రోజుల ముందు నుంచే సైన్యం తమ అధీనంలోకి తీసుకొంది. ఇందుకోసం సైనిక ఉన్నతాధికారులు, అధికారులు, సైనికులు పెద్ద సంఖ్యలో వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఖమ్మం పొలీస్ పరేడ్ మైదానంలో సైన్యం బస, భోజన ఏర్పాట్లు చేసుకుంది. అగ్నివీరుల ఎంపిక ప్రక్రియ పటేల్ స్టేడియంలో చేపట్టారు.

 
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ పరీక్ష రాసి  7,397 మంది అభ్యర్ధులు వ్యాయామ పరీక్షలకు అర్హత సాధించారు. వీరిలో రోజుకు వెయ్యి మందిని పిలిచి శారీరక, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

వ్యాయామ పరీక్షల్లో నెగ్గిన వారు మరుసటి రోజు స్టేడియంలోనే నిర్వహించే వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. తొలి రోజు వచ్చే అభ్యర్థులు ఎస్ఆర్ బీజీఎన్ఆర్ మైదానంలో నుంచి క్యూఆర్ కోడ్ ను 'స్కాన్ చేసి లోనికి వెళ్తారు. అక్కడి నుంచి స్టేడి యంలో జరిగే పరీక్షలకు హాజరవుతారు.పరీక్షలకు హరయ్యే అభ్యర్దిని తప్ప లోపలకు ఎవ్వరినీ అనుమతించని ఆర్మీ అధికారులు. జిల్లా కలెక్టర్ గౌతం ఎంపికలను పరిశీలించారు.