వైరా బీఆర్ఎస్ లో ఇన్ సైడ్ వార్

వైరా బీఆర్ఎస్ లో ఇన్ సైడ్ వార్

వైరా, ముద్ర: ఖమ్మం జిల్లాలోని వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ , బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ మదన్ లాల్ మధ్య  వివాదం నడుస్తోంది. ఇటీవల దళిత బంధు పథకం లబ్ధిదారుల జాబితాను ఎమ్మెల్యే రాములు నాయక్ మొదటగా 500 మంది తర్వాత 600 మంది జాబితాను జిల్లా కలెక్టర్ కు అందజేశారు. అయితే రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని, తన వర్గం వారికి దళిత బంధు రావాలని మదన్ లాల్ సుమారు 500 మంది జాబితాను అధికారులకు సమర్పించారు.  దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ ప్రకటించిన అభ్యర్థి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. శుక్రవారం ఎమ్మెల్యే రాములు నాయక్ నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వెళ్లకుండా నాయకులను, కార్యకర్తలను ఎమ్మెల్యే అభ్యర్థి నియంత్రించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రత్యర్థులతో తలపడాల్సిన అధికార పార్టీ ఇన్ సైడ్  వార్ గా మారింది. దీంతో అధికార పార్టీలో గందరగోళం ఏర్పడింది. నేతలు, కార్యకర్తలు వర్గాలుగా విడిపోతుండటం అధికార పార్టీని గందరగోళానికి గురిచేస్తోంది.