నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి తుమ్మల

నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి తుమ్మల

ఖమ్మం, ముద్ర: కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినితో కలిసి ఆయన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ కు ఒక సెట్ నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం మాజీ మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్ధి గా నామినేషన్ వేశాను.
ఖమ్మం భవిష్యత్ కోసం, ప్రజల అవసరాల మనోభావాలు కాపాడటం కోసం పని చేస్తానని చెప్పారు. మీ ఆశలకు,అవసరాలకు కోసం పని చేస్తానని తెలిపారు. తెలంగాణ ప్రజలు అందరూ  నీతి వంతమైన పాలన కోసం ఎదురు చూస్తున్న రని అన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 
నిరంకుశ పాలన కు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి తుమ్మల వెంట మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు మురళి వెంకటేశ్వర్లు, రఘునాథపాలెం ఎంపీపీ గౌరీ తదితరులు పాల్గొన్నారు.