మెడికో ప్రీతి కేసులో సైఫ్‌ జైలు నుంచి విడుదల

మెడికో ప్రీతి కేసులో సైఫ్‌ జైలు నుంచి విడుదల

ముద్ర ప్రతినిధి, ఖమ్మం :  మెడికో ప్రీతి మృతి కేసులో నిందితుడు సైఫ్‌ గురువారం సాయంత్రం ఖమ్మం దానవాయిగూడెం జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన కు బుధవారం షరతులతో కూడిన బెయిల్ ను  వరంగల్ కోర్టు లో మంజూరైంది. రూ.10 వేల బాండ్, ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని కోర్టు షరతు విధించింది.

బుధవారం బెయిల్ పత్రాలు సరిగా సమర్పించక పోవడంతో జైలు అధికారులు విడుదల చేయలేదు. మళ్ళీ రిమాండ్ కోసం గురువారం ఉదయం వరంగల్ న్యాయ స్థానానికి తీసుకెళ్లారు. బెయిల్ పత్రాలు కరెక్టుగా  సమర్పించడంతో వరంగల్ నుంచి ఖమ్మం జైలుకు తీసుకొచ్చి అనంతరం విడుదల చేశారు. సైఫ్‌ వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు.