చంద్రబాబు నాయుడు  ఐడియాలజీ కాన్సెప్ట్​

చంద్రబాబు నాయుడు  ఐడియాలజీ కాన్సెప్ట్​

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  జన్మదినం సందర్భంగా ఐడియాలజీ కాన్సెప్ట్​ ప్రకటించారు. మార్కాపురంలో ఐడియాలజీ కాన్సెప్ట్​ విడుదల చేశారు.  పేదలను సంపన్నులను చేయడమే లక్ష్యమన్న చంద్రబాబు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా నెంబర్​1 గా నిలవాలన్న సంకల్పం ఉండాలన్నారు.  సాధారణ మహిళలు, పిల్లలతో కాన్సెప్ట్​ విడుదల చేయించిన చంద్రబాబు. ఈ రెండు సంకల్పాలపై దృష్టి సారించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

గతంలో జన్మభూమి ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకున్నామన్నారు.  ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా పనిచేసి ప్రజల జీవితాలను మారుద్దామన్నారు.  సంపన్నులు తోటివారికి మెంటార్​గా నిలవాలన్నారు.  సాయం అందించడం ద్వారా జీవితాల్లో మార్పు తేవాలి. ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం పనిచేద్దాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక పాలసీ రూపొందిస్తాం. టెక్నాలజీ ద్వారా కుటుంబాలను యూనిట్​గా తీసుకొని ప్రజల జీవితాల్లో మార్పు తెస్తామన్న చంద్రబాబు.