బిజెపి, ఆర్ఎస్ఎస్ సంయుక్తంగా దేశాన్ని పాలిస్తున్నాయి: కేరళ సీఎం పినరయి విజయన్

బిజెపి, ఆర్ఎస్ఎస్ సంయుక్తంగా దేశాన్ని పాలిస్తున్నాయి: కేరళ సీఎం పినరయి విజయన్

సభలో  కేరళ సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ భవిష్యత్తు భారతదేశం కోసం ఇతర పార్టీలు ముఖ్యమంత్రులతో కలిసి కేసీఆర్ ఇలాంటి సభ నిర్వహించడం  అభినందనీయమన్నరూ. కంటి వెలుగు మంచి కార్యక్రమం, అదేవిధంగా ప్రజల సౌకర్యార్థం కొత్త కలెక్టరేట్లను ఏర్పాటు చేయడం మంచి పాలన అన్నారు. తెలంగాణ తరహా లోనే కేరళ కూడా అనేక పథకాలు చేపట్టిందని పేర్కొన్నారు. కేంద్ర వైఖరితో రాజ్యాంగ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని మండిపడ్డారు.  కార్పొరేట్ శక్తులకే కేంద్రం ఉతమిస్తోందని ఆరోపించారు.  కేంద్ర వైఖరితో లౌకిక తత్వం ప్రమాదoలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.  సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు.  కేంద్రం పై పోరాటం చేసేందుకు కేసీఆర్ నడుం బిగించడం శుభ పరిణామం అన్నారు. 


 స్వాతంత్ర సమరంలో పాల్గొనని శక్తులు కేంద్రంలో ప్రభుత్వo నడిపిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు.  బిజెపి, ఆర్ఎస్ఎస్ సంయుక్తంగా దేశాన్ని పాలిస్తున్నాయని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బిజెపి బలహీన పరుస్తోందని విమర్శించారు. ఉపరాష్ట్రపతి కూడా రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నారు ఎన్నికైన ప్రభుత్వాలు అనైతిక పద్ధతుల్లో కులదొస్తోందని ఆరోపించారు. హిందీ భాషను బలవంతంగా రాష్ట్రాల పై రుద్దే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. పూర్తిగా ఇంగ్లీష్ లోనే 20 నిమిషాలు ప్రసంగ పాఠాన్ని కొనసాగించారు.