కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం..
మేడిపల్లి ముద్ర : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని 11,22 వ డివిజన్ లలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ వంగేటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వంగేటి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్ధి తోటకూర వజ్రేశ్ యాదవ్ ను బారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టో లో ప్రకటించిన కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలను రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.ప్రజలనుండి విశేష స్పందన లభిస్తున్నదని కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి శ్రీధర్ రెడ్డి,రంగన్న గౌడ్, రంజిత్ రెడ్డి,సుధాకర్ రెడ్డి,సుభాష్,గూడేల్లి తిరుపతి రెడ్డి,శేఖర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,మహిళలు సరిత, నవనీత, సులోచన,రాణి తదితరులు పాల్గొన్నారు.