ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆఫీసుకు పామును తెచ్చి వదిలాడు..

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆఫీసుకు పామును తెచ్చి వదిలాడు..

ముద్ర ప్రతినిధి, మేడ్చల్: వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద, మురుగు నీటితో పాటు పాములు కూడా ఇంట్లోకి వస్తున్నాయని జీ హెచ్ ఎం సీ అధికారులకు ఫిర్యాధు చేసినా పట్టించు కోవడం లేదని అల్వాల్ ప్రాంతంలోని ఓ యువకుడు అధికారులకు దిమ్మ తిరిగేలా వినూత్న రీతిలో తన నిరసన వ్యక్తం చేశాడు.తన ఇంట్లోకి వచ్చిన పామునే పట్టుకుని నేరుగాజీ హెచ్ ఎం సీ వార్డు కార్యాలయానికి వెళ్లి  టేబుల్ పై పామును వదిలాడు.ఆల్వాల్ ప్రాంతానికి చెందిన సంపత్ కుమార్ ఇంట్లోకి వర్షం నీటితో పాటు పాము రావడం తో జీ హెచ్ ఎం సీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.  ఫిర్యాదు చేసి 6 గంటలు గడిచినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఓపిక నశించిన సంపత్ కుమార్  అల్వాల్ జీ హెచ్ ఎం సీ వార్డు ఆఫీసుకు పామును తీసుకొచ్చాడు. టేబుల్ పై పామును పెట్టి నిరసన తెలిపాడు...