ఉధృతంగా  ప్రవహిస్తున్న చలి వాగు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

ఉధృతంగా  ప్రవహిస్తున్న చలి వాగు..  లోతట్టు ప్రాంతాలు జలమయం

ముద్ర న్యూస్ రేగొండ: అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారి లో గల చలి వాగు పొంగి ప్రవహిస్తున్నాది. ఎడతెరిపిలేని వర్షాలతో మండలంలోని చలివాగు ఉధృతంగా ప్రవహించడంతో , రహదారులు మూసుకుపోయాయి.  ప్రతి రోజు కురుస్తున్న వర్షానికి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. చలి వాగు ప్రవహిస్తున్న పరిరసర ప్రాంతాల్లో  ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఇప్పుడిప్పుడే వరి నట్లు వేస్తున్న పంటలు పూర్తిగా మునిగిపోయాయి. దిగువన ప్రవహించే చలి వాగు ప్రాంతమైన కనిపర్తి.నాగుర్ల పల్లి.గ్రామాల్లో పంట భూములు పూర్తిగా మునిగిపోయాయి. ఇలాగే ఇంకో రెండుమూడు రోజులు కురిస్తే పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.

మరో రెండు రోజులు ఇలాగే తుఫాను ప్రభావం ఉంటుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు.