దివ్యాంగుల జీవితాలలో వెలుగులు నింపేందుకే పెన్షన్ పెంపు -మొగుళ్లపల్లి జడ్పీటీసీ జోరుక సదయ్య

దివ్యాంగుల జీవితాలలో వెలుగులు నింపేందుకే పెన్షన్ పెంపు  -మొగుళ్లపల్లి జడ్పీటీసీ జోరుక సదయ్య

ముద్ర, మొగుళ్లపల్లి: దివ్యాంగులైన.. వికలాంగుల జీవితాలలో వెలుగులు నింపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ 3016 రూపాయలు ఉన్న పెన్షన్ ను 4016 రూపాయలకు పెంచాడని మొగుళ్లపల్లి జడ్పిటిసి జోరుక సదయ్య అన్నారు. శనివారం దివ్యాంగులకు పెన్షన్ పెంచినందుకు వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పిటిసి జోరుక సదయ్య, ఎంపీపీ యార సుజాత సంజీవరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి, స్థానిక సర్పంచ్ మోటే ధర్మారావు, ఎంపీటీసీ ఎర్రబెల్లి వనిత పున్నం చందర్ రావులు హాజరై సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వికలాంగులకు పెన్షన్ పెంచి, వారి జీవితాలలో మనోస్థైర్యాన్ని  పెంపొందించి వికలాంగుల జీవితాలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు..రాబోయే ఎన్నికల్లో వికలాంగులు అండగా నిలిచి కెసిఆర్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పోలినేని రాజేశ్వర్ రావు, అంకుషాపురం గ్రామ సర్పంచ్ గాలి చంద్రమౌళి, మేదరమట్ల సర్పంచ్ కొనుకటి అరవింద్ రెడ్డి, ఎల్లారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ పెంతల రాజేందర్ రెడ్డి, గణేష్ పల్లి సర్పంచ్ తిప్పారపు యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.