జీ. పి సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి - రాదండి దేవేందర్

జీ. పి సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి - రాదండి దేవేందర్

ముద్ర న్యూస్ రేగొండ: నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ను చంద్రశేఖర రావు ప్రభుత్వం బజారు పాలు చేసిందని రాదండి దేవేందర్ అన్నారు. గత నాలుగు రోజులుగా రేగొండ మండల  కేంద్రంలో గ్రామపంచాయతీ ఉద్యోగులు చేస్తున్నటువంటి నిరవదిక సమ్మెకు ఉత్తర తెలంగాణ రాష్ట్ర సమితి  రాష్ర్ట నాయకులు రాదండి దేవేందర్, పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా రాదండి దేవేందర్, మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 60 ప్రకారం స్వీపర్లకు 15600 మిగతా సిబ్బందికి 19500 చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు.

కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియమించాలని జీవో నెంబర్ 51 సవరించాలని ప్రమాద బీమా 50 లక్షలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోను రద్దు చేయాలని గ్రామపంచాయతీ సిబ్బందికి అన్ని కార్మిక చట్టాలను అమలు చేయాలని రాదండి దేవేందర్ డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాటం ఆపదని వారికి ఇతర తెలంగాణ రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు సంఘీభావం తెలుపుతుందన్నారు.