భూపాలపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమణారెడ్డి గెలుపు కోరుతూ ఇంటింటి ప్రచారం

భూపాలపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమణారెడ్డి గెలుపు కోరుతూ ఇంటింటి ప్రచారం

ముద్ర, శాయంపేట : మండలంలోని పత్తిపాక గ్రామంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపుకోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించిన  సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి. ప్రచారంలో భాగంగా వారు మాట్లాడుతూ ఎలక్షన్ల ప్రచారానికి  కొత్త కొత్త నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ప్రజలు ఆలోచన చేసి అభివృద్ధి చేసే నాయకున్ని ఎన్నుకోవాలని  సూచించారు. ఒక్కొక్క కార్యకర్త 100 ఓట్లు వేసి గెలిపించాలని బిఆర్ఎస్ కార్యకర్తలను కోరారు. మన గ్రామం మరింత అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు