ప్రజల మొహాల్లో ఆనందం కోసమే బిఆర్ఎస్ పని చేస్తుంది.. కాంగ్రెస్ నమ్మి ఓటేస్తే కర్ణాటక ప్రజల కష్టాలు మనకు వస్తాయి

ప్రజల మొహాల్లో ఆనందం కోసమే బిఆర్ఎస్ పని చేస్తుంది.. కాంగ్రెస్ నమ్మి ఓటేస్తే కర్ణాటక ప్రజల కష్టాలు మనకు వస్తాయి

ముద్ర, వీనవంక : తెలంగాణ రాష్ట్ర రథసారధి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందే తెలంగాణ ప్రజల మొహాల్లో ఆనందం చూడడానికని హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వీణవంక మండల పరిధిలోని శ్రీరాములపేట, కోర్కల్, నర్సింహులపల్లి, మల్లారెడ్డిపల్లి గ్రామాల్లో ప్రచార నిర్వహించగా వారికి మహిళలు మంగళ హారతులతో డప్పు చప్పులతో ఘనంగా స్వాగతం పలికారు. పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ ఏర్పాటు నుంచి నేటి వరకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ముఖంలో ఆనందం చూస్తుంది.దేశంలోనే ఎక్కడలేని విధంగా రైతులకు 24 గంటలు కరెంటుతో పాటు రైతు రుణమాఫీ చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. రైతు పెట్టుబడి సాయం కోసం రైతుబంధు ఇచ్చి ఆదుకున్నారని, పంట పండిన ప్రతి గింజనుకొంటూ  వారం రోజుల్లోపు రైతులే ఎకౌంట్లో డబ్బులు జమ చేసి వారికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. గత 20 సంవత్సరాలుగా ఏడుసార్లు ఇక్కడి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను గెలిపిస్తే నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. ఉప ఎన్నికల కష్టకాలంలో కూడా గెలిపిస్తే కనీసం రెండున్నర సంవత్సరాలుగా ఒక్కసారి కూడా నియోజవర్గానికి రాకపోవడం బాధాకరమన్నారు. నాకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఐదు సంవత్సరాలలోపు హుజురాబాద్ ను సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మరోసారి పేద ప్రజల కోసం మేనిఫెస్టో రూపొందించారని, ఈ మేనిఫెస్టో పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతాయన్నారు. మేనిఫెస్టోలో సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు 3000 రూపాయలు అందించడంతోపాటు ఆరోగ్యశ్రీని 15 లక్షల పెంచుతామని అన్నారు. దీంతోపాటు ప్రతి కుటుంబానికి కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే పథకం తో  5 లక్షల ఉచిత బీమా అందిస్తూ గ్యాస్ సిలిండర్ ని కూడా 400 కి అందించనున్నామని అన్నారు. అలాగే రైతుబంధును కూడా 16 వేలకు పెంచుతామన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి ఇకపై అన్నపూర్ణ పథకం ద్వారా సన్న బియ్యం అందజేస్తామన్నారు. గ్రామాలలో ప్రజలు చెప్పిన పని గెలిచినాక తప్పక చేస్తానని హామీ ఇచ్చారు.