ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా టి. సత్య ప్రసాద్

ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా టి. సత్య ప్రసాద్

ముద్ర , కుషాయిగూడ: ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మేడ్చల్ జిల్లాకు చెందిన టి.సత్య ప్రసాద్ నియమితులయ్యారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో  ఆయన్ను ఏకగ్రీవంగా  ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా టి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని యువత సంక్షేమానికి, హక్కుల సాధనకు తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం మేడ్చల్ జిల్లా ఎఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శిగా సత్య ప్రసాద్ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు.